![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద "కార్తీక దీపం" సీరియల్ ఒక సెన్సేషన్ సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ సీరియల్ కి ఎండ్ కార్డు పడబోతోంది. దీనికి సంబంధించిన ఒక ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ సీరియల్ 2017 లో స్టార్ట్ అయ్యింది. అలా రాను రాను ఆ సీరియల్ టాప్ ప్లేస్ కి చేరుకుంది. సీరియల్ లోని క్యారెక్టర్స్ ని సొంత మనుషుల కంటే ఎక్కువగా చూసుకునే పరిస్థితికి ఆడియన్స్ వచ్చారు. ఈ సీరియల్ కి సంబంధించి ఎన్నో ట్రోల్స్ కూడా వచ్చాయి.
ఐతే ఈ సీరియల్ లోని దీప, సౌర్య క్యారెక్టర్స్ ని పెద్దవాళ్ళను చేసి చూపించేసరికి జనాలకు పెద్దగా ఎక్కలేదు. ఆ టైములో రేటింగ్ కిందకి వచ్చేసింది. దీప, డాక్టర్ బాబు క్యారెక్టర్స్ లేకపోయేసరికి ఆడియన్స్ చాలా ఫీల్ అయ్యారు. ఇక ఈ సీరియల్ మేకర్స్ విషయం అర్ధం చేసుకుని వెంటనే దీప-డాక్టర్ బాబు, మోనిత క్యారెక్టర్స్ ని మళ్లీ ప్రవేశపెట్టారు. అయితే అప్పటికే మిగతా సీరియల్స్ కి ఎడిక్ట్ అయిపోయిన ప్రేక్షకులు.. సడెన్ గా ట్విస్టులు ఇచ్చేసరికి పెద్దగా పట్టించుకోలేదు. అలా ఆ సీరియల్ కి ఆ పాత రేటింగ్ రాకుండా వెనక్కి వెళ్ళిపోయింది. ఆడియన్స్ కి కూడా ఈ సీరియల్ మీద పెద్దగా ఆసక్తి లేకపోయేసరికి ఇక సాగదీయడం వేస్ట్ అని తెలిసి దీనికి ఎండ్ కార్డ్ వేసేస్తున్నట్లు ఓ ప్రోమోని విడుదల చేశారు.
ఈ వీడియోలో దీప-డాక్టర్ బాబు స్వయంగా కొత్త సీరియల్ ని ప్రమోట్ చేశారు.‘కార్తీకదీపం మీకెన్నో మరపురాని జ్ఞాపకాలని ఇచ్చింది. మీ గుండెల్లో మాకు మంచి చోటుని కల్పించింది. ప్రతి గొప్ప కథకు గొప్ప ముగింపు ఉంటుంది. కార్తీకదీపం మీకు నచ్చే ఒక అద్భుతమైన క్లైమాక్స్ తో త్వరలో మీ ముందుకు రానుంది. కార్తీకదీపం క్లైమాక్స్ మరో సరికొత్త సీరియల్ కు నాంది పలకబోతోంది. అదే ‘బ్రహ్మముడి’. మా మీద చూపించిన ప్రేమాభిమానాలు.. కావ్య, రాజు పై కూడా ఇలానే చూపించాలి’ అని దీప-డాక్టర్ బాబు ఇద్దరూ ఆడియన్స్ ముందుకు వచ్చి చెప్పారు.
![]() |
![]() |